బీహార్‌లో బాలుడు బాలిక వేధింపుల కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: సురేష్ స్థలం: బీహార్

బీహార్‌లోని జముయి జిల్లాలో రోడ్డు పక్కన బాలుడు, బాలికను వేధించిన ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు నందన్ యాదవ్‌ను పోలీసులు కాల్పుల అనంతరం అరెస్టు చేశారు. సెప్టెంబర్ 19న జరిగిన ఈ అఘాయిత్యానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఇప్పటికే ఈ ఘటనపై ముగ్గురిని అరెస్ట్ చేయగా, మహిళా కమిషన్ సమగ్ర నివేదిక కోరింది.