భారత్-బంగ్లాదేశ్ మధ్య త్వరలో రైలు సర్వీసులు పునరుద్ధరణ?

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

భద్రతా కారణాల వల్ల 2024లో నిలిచిపోయిన భారత్-బంగ్లాదేశ్ మధ్య రైలు సర్వీసులను పునరుద్ధరించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఢాకా వేదికగా జరుగుతున్న ద్వైపాక్షిక రైల్వే సమావేశంలో మైత్రి, బంధన్, మితాలి ఎక్స్‌ప్రెస్ రైళ్ల పునరుద్ధరణపై చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో సానుకూల నిర్ణయం వెలువడితే వచ్చే నెల నుంచే సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.