ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' మూవీ ట్రైలర్ విడుదల
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న 'ఎపిక్' సినిమా ట్రైలర్‌ను రష్మిక మందన్న విడుదల చేశారు. లండన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం లివ్-ఇన్ రిలేషన్షిప్ చుట్టూ కామెడీ, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కింది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.