ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్న మహేష్ కుమార్ గౌడ్

రిపోర్టర్: మహేష్ స్థలం: ఢిల్లీ

తెలంగాణలో ఎలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీల తీరుకు గట్టి చెంపపెట్టు అని ఆయన విమర్శించారు. శనివారం నాడు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన మహా గణపతి పూజా కార్యక్రమంలో ఆయన ఘనంగా పాల్గొన్నారు.