తెలంగాణలో త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి సుమారు 50 కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులను భర్తీ చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. సామాజిక న్యాయం, కులగణన నివేదికల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. పార్టీ కోసం శ్రమించిన నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని పీసీసీ, ఏఐసీసీ నిర్ణయించాయి.