ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం: భారీ ట్రాఫిక్ జామ్లతో ఉక్కిరిబిక్కిరి

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రెండు వందల అరవై ఒకటికి చేరిందని అధికారులు వెల్లడించారు. నూతన శీతాకాల కాలుష్య నివారణ చర్యల అమలుతో నగర సరిహద్దుల్ లో భారీగా వాహనాలు నిలిచిపోయాయని, తీవ్ర ట్రాఫిక్ జామ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.