కాణిపాకం పురవీధుల్లో సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీ గణనాథుడు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు రాత్రి సూర్యప్రభ వాహనంపై దేవాది దేవుడు గణనాథుడు పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఈ దివ్య వేడుకలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మని నాయుడు, ఉభయదారులు, ఆలయ సిబ్బంది తదితరులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.