వలసంపేటలో వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లిన డాక్టర్ సౌమ్య
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వలసంపేట గ్రామంలో ఇంటింటికి వైఎస్ఆర్సిపి ప్రచారం విస్తృతంగా సాగింది. ఇతంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభ్యర్థి డాక్టర్ అంకంరెడ్డి సౌమ్య పాల్గొని ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఎంపీటీసీ అభ్యర్థి సిద్ధపత్తుల రమణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.