నెల్లూరులో పేరుకుపోయిన చెత్తను ఎరువుగా మార్చిన కూటమి ప్రభుత్వం
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
వైకాపా హయాంలో నెల్లూరు జిల్లాలో పేరుకుపోయిన చెత్తకొండలను కూటమి ప్రభుత్వం పూర్తిగా తొలగించిందని, రీసైక్లింగ్ ద్వారా దానిని ఎరువుగా మార్చామని అధికారులు తెలిపారు. ప్రజలపై భారం మోపుతూ వైకాపా ప్రభుత్వం గతంలో చెత్త పన్ను వసూలు చేసిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పన్నును రద్దు చేసి ఉచితంగా చెత్త సేకరణ చేపట్టిందని వెల్లడించారు. చెత్త నివారణకు రూ.18.75 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేశామని అధికారులు స్పష్టం చేశారు.