గొల్లప్రోలులో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దగ్ధమై తాగునీటికి అంతరాయం
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: గొల్లప్రోలు
గొల్లప్రోలు పురపాలక సంఘం పరిధిలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఉన్న ప్రధాన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ అకస్మాత్తుగా కాలిపోవడంతో నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయినట్లు పురపాలక అధికారులు వెల్లడించారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఇవి పూర్తయ్యే వరకు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.