డిసెంబర్ 4న క్రికెటర్ రింకూ సింగ్ వివాహం

రిపోర్టర్: సునీల్ స్థలం: ఉత్తర ప్రదేశ్

ప్రముఖ భారత క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహం డిసెంబర్ 4న లక్నోలోని రామాడా హోటల్‌లో జరగనుంది. కోవిడ్ సమయంలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరూ గత ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.