తిరుమలలో సర్వభూపాల వాహనంపై గజేంద్రమోక్ష అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
రిపోర్టర్: హరి
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి శ్రీమలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించగా భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఈ వాహనసేవల్లో తితిదే ఛైర్మన్ బీఆర్‌నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.