రైల్వే రిజర్వేషన్ టికెట్ల దందాపై ప్రయాణికుల తీవ్ర ఆందోళన
రిపోర్టర్: నరేష్
స్థలం: Vijayawada
విజయవాడ రైల్వేస్టేషన్ మరియు పరిసర రిజర్వేషన్ కేంద్రాలలో దళారులు ఐఆర్ సీటీసీ టికెట్లను భారీగా బ్లాక్ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ లు మరియు కొందరు సిబ్బంది కుమ్మక్కుతో సాగుతున్న ఈ అక్రమ దందా వల్ల ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాబోయే పండుగ సీజన్లను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు వెంటనే స్పందించి ఈ దందాను అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.