'ఝీరం ఘాటీ దాడి కేస్': 10 మందికి మరణశిక్ష విధించిన కోర్టు
రిపోర్టర్: సతీష్
స్థలం: ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝీరం ఘాటీలో 2013 మే 25న కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై మావోయిస్టులు జరిపిన ఘోర దాడిలో నంద్‌కుమార్ పటేల్, మహేంద్ర కర్మతో పాటు 29 మంది మృతి చెందిన ఘటనలో ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జగదాల్‌పూర్‌లోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఇద్దరు మహిళలతో సహా 10 మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాతే ఈ శిక్ష అమలవుతుందని స్పష్టం చేసింది.