దివ్యాంగుడికి అన్నం తినిపించిన మహిళా సిబ్బందిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఏలూరు
ద్కా తిరుమల అన్నప్రసాద కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడు సత్యనారాయణకు చేతులతో అన్నం తినిపించి ఆకలి తీర్చిన మహిళా ఉద్యోగి గాయత్రి సేవలు అత్యంత స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ మేరకు ఆమె మానవ సేవే మాధవ సేవ అని మరోసారి చాటిచెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.