ఖమ్మంలో పేద ప్రజల ఇళ్ల తొలగింపుపై తీవ్ర నిరసన
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఖమ్మం
ఖమ్మం శ్రీనివాసనగర్‌లో పేద ప్రజల ఇళ్లను తొలగిస్తుండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. తమ వద్ద పట్టాలు ఉన్నప్పటికీ ఇళ్లను ఎలా తొలగిస్తారని బాధితులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తమకు ఈ కష్టాలు వచ్చాయని, తమ ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని స్థానికులు హెచ్చరిస్తున్నారు.