రాష్ట్రంలో ప్రత్యేక ఎన్ఆర్ఐ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తక్షణమే ఒక ప్రత్యేక ఎన్ఆర్ఐ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ కూడా పాల్గొన్నారని తెలిపారు. ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న ఆస్తి వివాదాలు, భూ సమస్యల పరిష్కారానికి సింగిల్-విండో వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.