పురుషోత్తపురంలో నీట మునిగిన భారీ పంట పొలాలు

రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం గ్రామంలోని చవ్వాకుల పేట దరి సమీపంలో అర్నాద్ తుఫాన్ ప్రభావంతో పంట పొలాలు మొత్తం పూర్తిగా నీట మునిగాయి. దీనితో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా ముంచెత్తిన వర్షాల కారణంగా పెట్టుబడి కూడా చేతికి అందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన పొలాలను పరిశీలించి ఆదుకోవాలని రైతాంగం కోరుతోంది.