పొదలకూరు ఆర్టీసీ డిపోలో కరెంట్ పోతే అంధకారం

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోతే డిపో మొత్తం చీకటిమయంగా మారుతోంది. కనీసం ఇన్వర్టర్ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.