తీపి కబురు: ఒకే రోజు మూడు వందల మందికి ఆర్థిక సాయం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: పశ్చిమ గోదావరి
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒకే రోజులో 355 మంది లబ్ధిదారులకు రూ. 1 కోటి 55 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులోని మంత్రి కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.