సోషల్ మీడియా ట్రోలింగ్పై అమితాబ్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు: బూఢౌ అంటున్నారంటూ ఆవేదన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Mumbai

సోషల్ మీడియాలో కొందరు తనను బూఢౌ అంటూ ట్రోల్ చేశారని, ఆ నెగెటివ్ కామెంట్స్ చూసి తనకు ఎంతో విచిత్రంగా అనిపించిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. కౌన్ బనేగా కరోడ్పతి షోలో పాల్గొన్న ఆయన, ట్రోలింగ్ కారణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చాలావరకు తగ్గించేశానని స్పష్టం చేశారు. అయితే తాను రాయడం తగ్గించిన కొద్దీ ఫాలోవర్లు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నారని అమితాబ్ సరదాగా వ్యాఖ్యానించారు.