జాతీయ పురస్కారంతో కీర్తిని సంపాదించిన ఆదర్శ ఉపాధ్యాయుడు

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేలు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు, ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. నెల్లూరు జిల్లా కోటలో జరిగిన కార్యక్రమంలో ఆయనను ప్రశంసాపత్రం, షీల్డ్, గోల్డ్ మెడల్తో సత్కరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ ఘనత సాధించిన రాజశేఖర్ను పలువురు అభినందించారు.