ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల రిజర్వేషన్ల గుర్తింపు ప్రక్రియ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వుల మేరకు తొలి విడతలో 12 నగరపాలక సంస్థలు, 29 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలలో తొమ్మిది రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుండగా, అక్టోబర్ 1న తుది జాబితా విడుదల కానుంది.