అచ్యుతాపురంలో రూ.1.23 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

రిపోర్టర్: కిరణ్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం మార్టూరు గ్రామంలో రూ.1.23 కోట్ల భారీ అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, మురుగునీటి డ్రైనేజీలు మరియు కమ్యూనిటీ హాల్ను స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.