స్థానిక ఎన్నికల పారదర్శకతపై ఈసీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసినట్లు ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. పెన్షన్ల పంపిణీలో తెలుగుదేశం పార్టీ నేతలు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల భయభ్రాంతులు అలాగే నామినేషన్ల అడ్డుగింపుపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.