కోటపాడులో కోటి ఇరవై ఐదు లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం కింతాడ పంచాయతీ బత్తివానిపాలెంలో యాభై ఎనిమిది లక్షలతో వాటర్ ట్యాంక్, కింతాడలో ఇరవై మూడు లక్షలతో సిసి రోడ్లు, గోకులం షెడ్ మరియు ఆర్లిలో నలభై ఎనిమిదిన్నర లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ఘనంగా ప్రారంభించారు. మొత్తం సుమారు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఈ అభివృద్ధి పనులను చేపట్టారు.