బొల్లారం ఆర్మీ ఆర్మరీ ఆయుధాల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
సికింద్రాబాద్ బొల్లారంలోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆర్మరీలో ఆయుధాలు, బుల్లెట్లు మాయమైన కేసును తెలంగాణ పోలీసులు, మిలటరీ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ సంయుక్తంగా ఛేదించాయి. మాజీ ఆర్మీ ఉద్యోగితో పాటు అంతర్గత సిబ్బంది పక్కా ప్లాన్ తో ఈ చోరీకి పాల్పడినట్లు డీజీపీ తెలిపారు. మహబూబ్ నగర్ లో 4 ఏకే-47 రైఫిల్స్, 2 వేలకు పైగా లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.