దీపావళి వేళ బాంబే హైకోర్టు సంచలన తీర్పు: రోడ్లపై టపాసులు కాల్చడం నిషేధం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మహారాష్ట్ర

దీపావళి సందర్భంగా మహారాష్ట్రలో రోడ్లపై మరియు బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని బాంబే హైకోర్టు నిషేధించినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే టపాసుల తయారీ, అమ్మకాలపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది. శబ్ద, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు కోర్టు వెల్లడించింది.