టీచర్ పట్ల దురుసు ప్రవర్తనపై హెడ్ మాస్టర్ వ్యవహారశైలిపై గంటా ఆగ్రహం

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం చంద్రంపాలెం హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎం. వెంకట్రావు సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించడంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త చనిపోయి సెలవు కోరిన ఉపాధ్యాయురాలు గజలక్ష్మితో హెడ్ మాస్టర్ పరుషంగా మాట్లాడటాన్ని ఆమె ఆవేదనతో గంటా దృష్టికి తీసుకెళ్లారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో విద్యా శాఖ అధికారులతో సమావేశమైన ఆయన, వివాదరహితుడైన హెడ్ మాస్టర్‌ను నియమించాలని ఆదేశించారు.