యువతలో వ్యసనాల నివారణ కోసం నవీన్ యాదవ్ కీలక హామీ

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

విజయదశమి సందర్భంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, స్వర్ణ నంది అవార్డు గ్రహీత మాచర్ల శివశంకర్ను ప్రత్యేకంగా అభినందించారు. ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల్లో యువతలో మత్తు పదార్థాల నివారణకు ఆయన చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.