ఏపీలో అబాట్ పెట్టుబడులపై మంత్రి నారా లోకేష్ కీలక భేటీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో అబాట్ ఇండియా ఎండీ ఇస్తేయాక్ అంజాద్‌తో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆహ్వానించారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌లో జెనరిక్ మందుల కేంద్రం, విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అబాట్ ఎండీ అంజాద్ తెలిపారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.