వర్షం పడితే రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతున్న సిద్దాపురం రహదారి
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామ పరిధిలోని మధిర సిద్దాపురంలో వర్షం కురిస్తే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోడ్డుపై గుంతలు ఏర్పడి నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్తుడు రాంపాక మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.