ది ప్యారడైజ్ షూటింగ్ విశేషాలు వెల్లడించిన నటి కాయదు లోహర్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ కాయదు లోహర్ ఆయన పనితీరుపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెట్స్‌లో శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ కోసం ఎంతగా శ్రమిస్తారో వివరించారు. ఒక సీన్ అనుకున్న విధంగా వచ్చినా మరో ఆలోచనతో మళ్లీ టేకులు తీసుకుంటారని తెలిపారు. ఈ సినిమా తనకు ఓపిక నేర్పిందని, తెర వెనుక పడిన కష్టమంతా సినిమా గురించేనని కాయదు లోహర్ స్పష్టం చేశారు.