'ఈపీఎఫ్‌వో వేతన పరిమితి పెంపు': బీజేపీ ఆంధ్రప్రదేశ్ వెల్లడి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ఉద్యోగుల సామాజిక భద్రతను విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌వో వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే కీలక నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ అలాగే బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేసింది.