హైదరాబాద్ లో భారీ నకిలీ నోట్ల ముఠా భరతం పట్టిన పోలీసులు
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
హైదరాబాద్లో కోట్లాది రూపాయల విలువైన నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుంట్లూరు అద్దె ఇంట్లో ఫోటోషాప్ సాయంతో ఈ అక్రమ దందాను నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా నకిలీ కరెన్సీతో పాటు డమ్మీ పిస్టల్స్, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.