సచిన్ రికార్డుకు చేరువలో జో రూట్: ప్రశంసలు కురిపించిన టెండూల్కర్

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన తొలి టెస్ట్ మ్యాచ్లోనే గొప్ప ఆటగాడవుతాడని గ్రహించినట్లు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో నిర్వహించిన ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ లో ఆయన మాట్లాడుతూ, టెస్ట్ క్రికెట్ లో తన అత్యధిక పరుగుల రికార్డును రూట్ అధిగమించే దిశగా సాగుతున్నాడని ప్రశంసించారు. ప్రస్తుతం జో రూట్ 14,278 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడని, సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి మరో 1,643 పరుగులు మాత్రమే అవసరమని ఆయన పేర్కొన్నారు.