'బీఆర్ఎస్తో సెట్టింగ్': రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
కల్వకుంట్ల కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డికి డీల్ కుదరకే అసెంబ్లీలో ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అక్రమాలపై ముందు సిట్, తర్వాత సీఐడీ అంటూ ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయేందుకు సెట్టింగ్ చేసుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన స్కాములపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.