వైద్య రంగంలో షాకింగ్ ఘటన: తనకు మల్టిపుల్ స్క్లెరోసిస్ లేదన్న క్రిస్టినా ఆపిల్గేట్
రిపోర్టర్: శివ
స్థలం: హాలీవుడ్
తనకు ఐదేళ్ల క్రితం సోకిందంటూ వైద్యులు నిర్ధారించిన మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి తప్పు అని తేలిందని ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టినా ఆపిల్గేట్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పాడ్కాస్ట్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఈ వైద్య నిర్ధారణ మార్పు తనకు ఎలాంటి ఊరటనివ్వలేదని, ఇప్పటికీ తీవ్రమైన శారీరక నొప్పులతో ఇబ్బంది పడుతున్నానని వెల్లడించారు. అసలు తన శరీరంలో ఏం జరుగుతుందో అర్థంకాక మళ్లీ మొదటికి వచ్చానని, వైద్యులు మరింత లోతుగా పరీక్షలు జరిపి అసలు నిజం తేల్చాలని ఆమె కోరారు.