తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి సంజీవరావును తొలగించిన కమిటీ

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంతన సంజీవరావును బాధ్యతల నుంచి తొలగించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రాచమోని నాగభూషణం తెలిపారు. ఖమ్మం ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఈ కఠిన చర్య తీసుకున్నామన్నారు. అక్టోబర్ ముప్పై ఒకటిన కొత్తగూడెంలో జరగాల్సిన ఆవిర్భావ సభను పూర్తిగా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.