కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు కలిసి వస్తామన్న వైకాపా అదినేత జగన్
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై తమతో కలిసి పోరాటాలు చేసేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్ సుముఖత వ్యక్తం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. కరవుపై ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన్ను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు కుట్రలపై పోరాడాలని కోరినట్లు వెల్లడించారు.