ఉపాధ్యాయుల టెట్ పరీక్షలో అతి తేలికైన ప్రశ్నలపై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

ఉపాధ్యాయులకు నిర్వహించిన ప్రత్యేక టెట్ పరీక్షలో అతి తేలికైన ప్రశ్నలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీఈఆర్టీ రూపొందించిన ఈ ప్రశ్నపత్రంలో చెట్లు, బెల్లం తయారీ వంటి సాధారణ అంశాలపై ప్రశ్నలు ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ టెట్ అర్హత సాధించాల్సి ఉండటంతో, అధికారులు ఈ పరీక్షను నిర్వహించినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.