యూకే విచ్ఛిన్నమే లక్ష్యంగా స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ సమ్మిట్

రిపోర్టర్: హరి స్థలం: World

యునైటెడ్ కింగ్‌డమ్ విచ్ఛిన్నమే లక్ష్యంగా స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ దేశాల అగ్రనేతలు కార్డిఫ్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. రాజ్యాంగ మార్పుల కోసం బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వీరు చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. వెస్ట్ మినిస్టర్ ప్రయోజనాలు తమకు ఎప్పటికీ అక్కర్లేదని, తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ప్రజలకు ఉండాలని నేతలు స్పష్టం చేశారు.