ముంబై విమానాశ్రయంలో కలకలం: ఎయిర్ ఇండియా సిబ్బంది బ్యాగ్ చోరీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: Mumbai

ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన సిబ్బందికి చెందిన బ్యాగు నుంచి రెండు వేల నూట ఇరవై అమెరికన్ డాలర్లు చోరీకి గురయ్యాయని సహర్ పోలీసులు తెలిపారు. ఎస్.సానా అనే క్యాబిన్ క్రూ సభ్యురాలు న్యూయార్క్ నుంచి ముంబై వచ్చిన తర్వాత తన బ్యాగ్లో డబ్బు లేకపోవడాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.