కీవ్ సమీపంలో ఉద్రిక్తత: సైనిక కేంద్రం వద్ద ఘర్షణలతో తీవ్ర కలకలం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Kyiv
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో సైనిక సమీకరణ వివాదం తీవ్ర కలకలం రేపింది. పెట్రోపావ్లివ్స్కా బోర్ష్చాహివ్కా లోని నేషనల్ గార్డ్ కేంద్రం వద్ద ప్రజలు భారీగా గుమికూడి ఆందోళన చేపట్టారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. నేలమాళిగలో కొందరిని బంధించి వైద్య సేవలు నిరాకరించారనే ఆరోపణలతో ఈ ఘర్షణ చెలరేగిందని, నలుగురు సైనికులు గాయపడ్డారని అధికారులు స్పష్టం చేశారు.