కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: క్రీడా వస్తువుల పథకానికి భారీ కేటాయింపులు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు G Kishan Reddy వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.1,856.67 కోట్ల వ్యయంతో ఖేలో ఇండియా క్రీడా వస్తువుల తయారీ పథకానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు శాతం కరవు భత్యం పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఈ నిర్ణయాలు దేశంలోని క్రీడా రంగానికి, ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తాయని స్పష్టం చేశారు.