మద్యం మత్తులో డాక్టర్ సర్జరీ.. గర్భిణి మృతి!
రిపోర్టర్: సునీల్
స్థలం: Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణం జరిగింది. పురిటినొప్పులతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన జూలీ అనే గర్భిణికి డాక్టర్ కేపీ మద్యం మత్తులో సర్జరీ చేశాడు. ప్రసవం తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో బరేలీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.