బిరుపా నదిలో రెండు గంటల పాటు కొట్టుకుపోయిన వృద్ధురాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఒడిశా
ఒడిశాలోని బిరుపా నదిలో ప్రమాదవశాత్తూ పడిపోయిన డెబ్బై రెండేళ్ల వృద్ధురాలు కేశీ దళాయి సుమారు ఇరవై రెండు కిలోమీటర్లు ప్రయాణించి ప్రాణాలతో బయటపడ్డారు. జాజ్పుర్ జిల్లా నుంచి వరద నీటిలో కొట్టుకువచ్చిన ఆమెను కేంద్రాపడా జిల్లా బాలిపాటణ ప్రాంత యువకులు పడవలో వెళ్లి సకాలంలో రక్షించినట్లు స్థానికులు తెలిపారు. నదిలో మొసళ్లు ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా ఈదుతూ ప్రాణాలు కాపాడుకున్నారు. అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించడంతో ఆమె కోలుకున్నారు.