స్థానిక సమరంలో కూటమికి నిద్రపట్టకుండా చేస్తున్న తిరుగుబాటు అభ్యర్థుల దెబ్బ
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
మండల ప్రాదేశిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినా అసంతృప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో రెబల్స్ బరిలో నిలవడంతో అభ్యర్థులకు గట్టి సవాల్ ఎదురవుతోంది. జడ్పీటీసీ స్థానం దక్కడంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతున్నప్పటికీ, అసమ్మతి పోరు ఎన్నికల రాజకీయాన్ని అత్యంత ఆసక్తికరంగా మారుస్తోంది.