డక్కిలి జడ్పీటీసీ అభ్యర్థిగా సర్వేపల్లి రత్నయ్య
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా సర్వేపల్లి రత్నయ్యను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ స్వయంగా తన చేతుల మీదుగా బి ఫామ్‌ను అభ్యర్థి రత్నయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.