నా కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపదు: నటి శ్రీనిధి శెట్టి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి నటనపై మక్కువతో చిత్ర పరిశ్రమలోకి వచ్చానని హీరోయిన్ శ్రీనిధి శెట్టి వెల్లడించారు. వెంకటేశ్ సరసన నటించిన ఆదర్శకుటుంబం సినిమా ఈ నెల తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను పోషించిన తల్లి పాత్ర కెరీర్పై చెడు ప్రభావం చూపుతుందని వస్తున్న ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. ఈ చిత్రం చూశాక ఆ పాత్రకు ఎందుకు అంగీకరించానో అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు.